జడ్పీ వైస్ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ

మదనపల్లి నవంబర్ 17: అన్నమయ్య జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. అన్నమయ్య జిల్లాలో 25 మండలాలకు గాను 18 మండలాలు టిడిపి జెడ్పిటిసి అభ్యర్థులు గెలిచారు. మిగిలిన ఎడింటిటిలో ఒకటి బిజెపి ఆరు వైసిపి అభ్యర్థులు గెలిచారు.
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గాలివీడు జడ్పిటిసిగా గెలుపొందడంతో పార్టీ అధిష్టానం ఆయనకే జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా జడ్పీ వైస్ చైర్మన్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది.
రాయచోటి నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ కేటాయించడంతో,… జిల్లాలోని పడమటి ప్రాంతాలకు జడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఇక్కడి నాయకులు పట్టుబడుతున్నారు.

ఇందులో భాగంగా మహిళా కోటాలో తమకే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని బిజెపి నుంచి ఏకైక జెడ్పిటిసిగా గెలిచిన జబ్బల శ్రీనివాసులు సతీమణి జబ్బల మీనా కోరుతున్నారు. ఈ మేరకు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసి ఆశీర్వాదం పొందారు. ప్రస్తుతం బిజెపిలో అగ్రస్థానంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చరవతో తమకు ఈ వైస్ చైర్మన్ కావాలని కోరుతున్నారు.

ఇకపోతే జడ్పి చైర్మన్ స్థానం బలిజలకు కేటాయించడంతో వైస్ చైర్మన్ బీసీకి కేటాయిస్తారని అది తనకే ఇవ్వాలని కురబలకోట జడ్పిటిసి సురేంద్ర యాదవ్ కోరుతున్నారు. ఈ మేరకు టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ ను కలిసి తన అభ్యర్థిత్వం పరిశీలించాలని కోరారు.
దీంతోపాటు పీలేరు నియోజకవర్గం కలికిరికి చెందిన జడ్పిటిసి షర్మిల కూడా జడ్పీ వైస్ చైర్మన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలు టీడీపీ అధిష్టానం నుంచి సీల్డ్ కవర్లో రానున్నట్లు సమాచారం. ఈనెల 20వ తేదీన అన్నమయ్య జిల్లా తొలి జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభంతో పాటు ప్రమాణ స్వీకారం ఉండటంతో ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *