మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్ 101’ అంశంపై హ్యాండ్స్ఆన్ వర్క్‌షాప్ నిర్వహించారు.
మిట్స్ ఐఐసీ సెల్, ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన ఓపెన్‌సోర్స్ డీబీ సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పి. హరి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక రంగంలో డేటాబేస్‌ల ప్రాధాన్యత, ఏఐ ఆధారిత అనువర్తనాల్లో పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్ వినియోగం గురించి వివరించారు. వెక్టర్ డేటాబేస్లు, ఎంబెడ్డింగ్స్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ (RAG) వంటి ఆధునిక సాంకేతిక అంశాలను ఉదాహరణలతో వివరిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.
విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆధునిక సాంకేతికతలపై ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, తద్వారా ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ అభివృద్ధి రంగాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్. కల్పన, కోఆర్డినేటర్ డాక్టర్ పి. ప్రనీల్ కుమార్, కో-కోఆర్డినేటర్లు డాక్టర్ ఎన్. పురంధర్, కె. మహమ్మద్‌తో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


