మదనపల్లె: మదనపల్లె రూరల్ మండలం బసినికొండ గ్రామ సరిహద్దుల్లోని హంద్రీ–నీవా కాలువ నుంచి స్థానిక చెరువులకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే మద్దతుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జునైద్ అక్బరి స్థానిక నాయకులతో కలిసి జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి కృష్ణా జలాలను చెరువులకు విడుదల చేశారు.

హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో బసినికొండ ప్రాంతంలోని చెరువులకు నీరు చేరే అవకాశం ఏర్పడింది. దీంతో సాగునీటి అవసరాలతో పాటు భూగర్భ జలాల పెంపునకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
