చికలబైలు సచివాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆకస్మిక తనిఖీ

మదనపల్లె: మదనపల్లె మండలం చికలబైలు గ్రామపంచాయతీ సచివాలయాన్ని ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పరిపాలనా పనితీరును పరిశీలించారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *