మదనపల్లె, సెప్టెంబర్ 8: మదనపల్లె పట్టణంలో జెసిబిని దొంగలించిన వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలల సాధారణ జర శిక్ష విధించింది. టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ కథనం మేరకు..
మదనపల్లి టౌన్ GRT జ్యువెలర్స్ కు ఎదురుగా ఉన్న నాదెళ్ల రమేష్ అండ్ బ్రదర్స్ ఎర్త్ మూవర్స్ జెసిబి ఆఫీస్ వద్ద ఉన్న జెసిబి ని 2023 వ సంవత్సరం లో దొంగతనం చేసాడని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మూడేళ్ల పాటు న్యాయస్థానంలో పోలీస్ కేసు విచారణ జరగగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతడికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2వేలు జరిమాన విధిస్తూ మదనపల్లి ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సుభహాన్ తీర్పు చెప్పప్పారు. ప్రాసిక్యూషన్ తరపున Sr APP కృష్ణా రెడ్డి వాదించారు.
