ఏడు రోజుల పాటు అన్నదానం, పండ్ల పంపిణీ.. జర్నలిస్టులు, ఉపాధ్యాయులకు సన్మానం
మదనపల్లె, అన్నమయ్య జిల్లా: వాసవి క్లబ్ స్థాపకులు కేసీ చంద్రశేఖర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాసవి యువ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వీక్‌ను ప్రారంభించారు.
వాసవి వీక్‌లో భాగంగా ఏడు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ అన్నదానం, పండ్ల పంపిణీతో పాటు సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టులు, విద్యాబోధనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు.
సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించడమే లక్ష్యంగా వాసవి వీక్‌ను నిర్వహిస్తున్నట్లు వాసవి యువ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాసవి యువ క్లబ్ అధ్యక్షులు బాలాజీతో పాటు వాసవి కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
