మదనపల్లి, సెప్టెంబర్ 6: మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు, మొలకలచెరువు సింగిల్ విండో అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు స్వగృహంలో ఆదివారం నిర్వహించిన వివాహ విందుకు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ భాషా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాటకొండ మధుబాబు, అన్నమయ్య జిల్లా తెలుగు రైతు నాయకులు ఒంటికొండ వెంకటేష్, తెలుగు యువత నాయకులు గండికోట గణేష్, డాన్స్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
