నిమ్మనపల్లి, ఆగస్టు 26:( gtvmedia)నిమ్మనపల్లె మండలం నేల మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా రెడ్డి మోహన్ నియమితులయ్యారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.
రెడ్డి మోహన్ తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి దేవస్థానం చైర్మన్‌గా అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని శ్రీరామ్ చినబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండలం సింగిల్ విండో అధ్యక్షులు రమణ,విజయ్, చెన్న రాయుడు, శంకర, ఎల్లారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నేల మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా రెడ్డి మోహన్ నియామకం
