భూకబ్జాల పై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎస్పీ : ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ఆగస్టు 24: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల భూకబ్జాలకు ఫిర్యాదులు వస్తున్నాయని.. వీటిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్ని పోలీస్ స్టేషన్ల సీఐ, ఎస్ఐ లను ఆదేశించారు.
మదనపల్లె లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫిర్యాదులు స్వీకరించారు.

మొత్తం వచ్చిన 85 ఫిర్యాదుల్లో భూ వివాదాలు 33, డబ్బు లావాదేవీలు 19, ఇతర సమస్యలు 13, కుటుంబ సమస్యలు 10, మోసం 6, ఎఫ్.ఐ.ఆర్ సంబంధిత 2, న్యూసెన్స్ 1 మరియు మిస్సింగ్ 1 ఉన్నాయి.

భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *