అన్నమయ్య జిల్లా | మదనపల్లె(gtvmedia)
🚨 వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
మదనపల్లెలో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మంగళవారం ఉదయం శేషమహల్ సమీపంలో వాకింగ్‌కు వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి టార్గెట్ చేశాడు.
మహిళ మెడలో ఉన్న సుమారు 25 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని దొంగ బైక్‌పై పరారైనట్లు సమాచారం.
ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి, సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తిని త్వరగా గుర్తించి పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
