మదనపల్లె మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల..

  • ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ కమిషనర్ కె. ప్రమీల, నూతన మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా ఎన్నికైన శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం త్వరలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లు, మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు. పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించే దిశగా సమన్వయంతో ముందుకు సాగడంపై కూడా చర్చించినట్లు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *