మొబైల్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ ధరలు!

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు శాంసంగ్, షియోమీ తమ ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. మొత్తం 41 మోడళ్ల ధరలను గరిష్ఠంగా 18.75 శాతం వరకు పెంచినట్లు సమాచారం.

ధరల పెంపు వివరాలు:

  • శాంసంగ్‌కు చెందిన 22 మోడళ్ల ధరలు పెరిగాయి.
  • షియోమీకి చెందిన 19 మోడళ్ల ధరలు పెరిగాయి.
  • మోడల్‌ను బట్టి రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ధరలు పెరిగాయి.
  • పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

మెమరీ చిప్స్‌తో పాటు ఇతర ముడిసరుకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.

మరోవైపు త్వరలోనే ఒప్పో, వివో, రియల్‌మీ సంస్థలు కూడా తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మొత్తానికి కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ధరల పెంపు భారంగా మారనుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *