వృద్ధురాలు హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

మదనపల్లె, సెప్టెంబర్ 6: మదనపల్లి మండలం కొండామరిపల్లె వృద్దురాలి హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మదనపల్లి డిఎస్పి బుచ్చిరాజు కథనం మేరకు..
కొండమురేపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీదేవి(83), హైవే పక్కన ఉన్న ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఈ దుకాణం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె మెడలో ఉన్న నగలు కాజేసేందుకు.. ఆర్టీవో కార్యాలయంలో కాంట్రాక్టు వాచ్మెన్ గా పనిచేస్తున్న శరత్ చంద్ర, అతని ప్రియురాలు ప్రమీల కలసి వృద్ధురాలు లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారు.
వృద్ధురాలని తిరుపతి జిల్లా వనమాల పేట సమీపంలో తీసుకెళ్లి ఆమె గొంతు నలిమే హత్య చేశారు. బంగారు నగలు తీసుకొని, వృద్ధురాలి శవాన్ని పూడ్చిపెట్టేశారు.

వృద్ధురాలు కనబడకపోయి పోవడంతో ఆమె కోడలు సుగుణ ఇచ్చిన ఫిర్యాదుతో తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఇందులో భాగంగా నిందితులు శరత్ చంద్ర, ప్రమీలలు ఇద్దరు కలిసి స్థానిక విఆర్ఓ సమక్షంలో లొంగిపోయారు.
ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్టు చేసిన తాలూకా సిఐ కళా వెంకటరమణ, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *